• లాగిన్ / నమోదు
  • Supreme Court

    Harish Rao: కంచ గచ్చిబౌలి భూములపై సెబీ చైర్మన్‌కు హరీష్‌రావు ఫిర్యాదు

    హైదరాబాద్: కంచె గచ్చిబౌలి భూములను (Kancha Gachibowli Lands) తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడం సెబీ నిబంధనలకు విరుద్ధమంటూ సెబీ (SEBI) చైర్మన్‌కు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (BRS MLA Harish Rao) ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు, ఆధారాలతో సెబీకి ఇవాళ(గురువారం) హరీష్‌రావు లేఖ రాశారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పులు టీజీఐఐసీ (TGIIC) ద్వారా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలను లేఖలో ఎండగట్టారు. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ (Central Empower Committee) ప్రకారం ఈ భూమి అటవీ భూమిగా గుర్తించిందని, అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసిన అధికారులను జైలుకు పంపుతామని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని లేఖలో హరీష్‌రావు ప్రస్తావించారు.

    వ్యాఖ్యానించండి

    న్యూస్ లెటర్

    ఉండడానికి మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి.