• లాగిన్ / నమోదు
  • AndhraPradesh

    నాకు బెయిల్ ఇవ్వండి ప్లీజ్.. ఏపీ హై కోర్టులో పీఎస్ఆర్ ఆంజనేయులు పిటిషన్

    ఏపీపీఎస్సీ గ్రూప్ -1 జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో తమకు బెయిల్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, క్యామ్ సైన్ డైరెక్టర్ మధుసూదన్ పిటిషన్లు వేశారు. పీఎస్ఆర్ ఆంజనేయులు వేసిన పిటిషన్‌కు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.ఏపీపీఎస్సీ గ్రూప్ -1 (APPSC Group- 1) జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో తమకు బెయిల్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu), క్యామ్ సైన్ డైరెక్టర్ మధుసూదన్‌లు ఇవాళ (గురువారం) పిటిషన్లు దాఖలు వేశారు. పీఎస్ఆర్ ఆంజనేయులు వేసిన పిటిషన్‌కు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. మధుసూదన్‌పై కేసు వివరాలు సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.పీఎస్ఆర్ ఆంజనేయులు వేసిన వ్యాజ్యానికి నెంబర్ ఇచ్చేందుకు రిజిస్ట్రరీ నిరాకరించింది. అనారోగ్య కారణాలతో ట్రైల్ కోర్టు రెండు వారాలు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని, గడువు ముగియకుండానే బెయిల్ పిటిషన్ ఎలా వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. పీఎస్ఆర్ ఆంజనేయులకు బైపాస్ సర్జరీ అవసరమని వైద్యులు సూచించారని.. అందువల్లే అత్యవసరంగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని పిటిషనర్ తరుపు న్యాయవాది పేర్కొన్నారు. మధ్యంతర బెయిల్ గడువు ఈ నెల 27వ తేదీతో ముగుస్తోందని పిటిషనర్ తరుపు న్యాయవాది తెలిపారు. దీంతో పీఎస్ఆర్ వేసిన పిటిషన్‌కు నెంబర్ కేటాయించాలని రిజిస్టరీకి ఏపీ హైకోర్టు ఆదేశించింది.

    వ్యాఖ్యానించండి

    న్యూస్ లెటర్

    ఉండడానికి మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి.