• లాగిన్ / నమోదు
  • Supreme Court

    మధ్యవర్తిత్వంతో పెండింగ్‌ కేసుల పరిష్కారం

    పెండింగ్‌ కేసుల పరిష్కారంపై సుప్రీంకోర్టు ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించనుంది. తాలూకా స్థాయి కోర్టుల నుంచి హైకోర్టుల వరకు పెండింగ్‌లో ఉన్న వివాదాలను తేల్చేందుకు 90 రోజుల పాటు ‘జాతీయ స్థాయి మధ్యవర్తిత్వ ప్రచార కార్యక్రమా’న్ని నిర్వహించనుంది.

    న్యూఢిల్లీ, జూన్‌ 27: పెండింగ్‌ కేసుల పరిష్కారంపై సుప్రీంకోర్టు ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించనుంది. తాలూకా స్థాయి కోర్టుల నుంచి హైకోర్టుల వరకు పెండింగ్‌లో ఉన్న వివాదాలను తేల్చేందుకు 90 రోజుల పాటు ‘జాతీయ స్థాయి మధ్యవర్తిత్వ ప్రచార కార్యక్రమా’న్ని నిర్వహించనుంది. ‘జాతి కోసం మధ్యవర్తిత్వం’ పేరుతో జరిగే ఈ కార్యక్రమం జులై ఒకటో తేదీన ప్రారంభమయి సెప్టెంబరు 30న ముగియనుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని మధ్యవర్తిత్వ, సాంత్వన ప్రాజెక్టు కమిటీ (మీడియేషన్‌ అండ్‌ కాన్సిలియేషన్‌ ప్రాజెక్టు కమిటీ-ఎంసీపీసీ), జాతీయ న్యాయసేవల సంస్థ (నల్సా) గురువారం ప్రకటించాయి.

    వ్యాఖ్యానించండి

    న్యూస్ లెటర్

    ఉండడానికి మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి.