ఘర్షణ పడ్డ విద్యార్థిపై ఎన్‌ఎస్‌ఏ చట్టమా: సుప్రీం
మధ్యప్రదేశ్‌కు చెందిన న్యాయ శాస్త్ర విద్యార్థిని జాతీయ భద్రత చట్టం(ఎన్‌ఎ్‌సఏ) కింద ముందస్తుగా నిర్బంధంలోకి తీసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ, జూన్ 28: మధ్యప్రదేశ్‌కు చెందిన న్యాయ శాస్త్ర విద్యార్థిని జాతీయ భద్రత చట్టం(ఎన్‌ఎ్‌సఏ) కింద ముందస్తుగా నిర్బంధంలోకి తీసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వెంటనే ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. ఆ విద్యార్థిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవాలంటూ 2024 జులై 11న మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను తప్పుపట్టింది. బేతుల్‌లోని విశ్వవిద్యాలయం క్యాంప్‌సలో అనికేత్ అలియాస్ అన్ను అనే లా విద్యార్థి ఓ ప్రొఫెసర్‌తో ఘర్షణకు దిగడంతో ఆయనపై కేసు నమోదయింది. హత్యాయత్నం, ఇతర సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అతనిపై ఇతర క్రిమినల్ కేసులు కూడా ఉండడంతో ఎన్‌ఎ్‌సఏ కింద ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అనంతరం భోపాల్‌లోని సెంట్రల్ జైలుకు పంపించారు. ఆ ఆదేశాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి మొత్తం నాలుగుసార్లు పొడిగిస్తూ వచ్చారు. దీంతో సదరు విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
వ్యాఖ్యానించండి