• లాగిన్ / నమోదు
  • Telangana

    తెలంగాణ హైకోర్టులో గ్రూప్‌1పై విచారణ వాయిదా

    తెలంగాణ హైకోర్టులో గ్రూప్‌1పై తదుపరి విచారణ జూన్‌ 30కి వాయిదా పడింది. గ్రూప్‌1 మెయిన్స్పరీక్ష కేంద్రాల కేటాయింపు, మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ పలువురు అభ్యర్థులు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు.   పిటీషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.  విచారణలో భాగంగా పునర్మూల్యాంకనం(రీవాల్యుయేషన్‌) చేయాలని లేదా మరోసారి మెయిన్స్ నిర్వహించాలన్న పిటీషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. అయితే, అభ్యర్థులు కేవలం అపోహపడుతున్నారని... నిపుణులతో మెయిన్స్ పత్రాలు మూల్యాంకనం చేయించామని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను  నెల 30కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

    వ్యాఖ్యానించండి

    న్యూస్ లెటర్

    ఉండడానికి మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి.