• లాగిన్ / నమోదు
  • Telangana

    స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు

    తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పును రిజర్వ్చేసింది. ఇవాళ (జూన్ 23, 2025) జరిగిన విచారణలో పిటిషనర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తమ వాదనలు వినిపించింది. దీనిలో భాగంగా ఎన్ని రోజుల్లో ఎన్నికల నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది

    గత  ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం.. ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని అడిగింది. దీనికి ప్రభుత్వం సమాధానమిస్తూ.. సమయం కావాలని కోరింది.  అయితే ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని ఎన్నికల కమిషన్కూడా కోర్టుకు విన్నవించింది. ప్రభుత్వం తమ ప్రక్రియ పూర్తి చేస్తే తాము ఎన్నికల నిర్వహణకు ముందుకెళతామని ఈసీ స్పష్టం చేసింది.  మేరకు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్చేసింది

    వ్యాఖ్యానించండి

    న్యూస్ లెటర్

    ఉండడానికి మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి.